Children's Phone Usage : పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ చూస్తున్నారా..? ఈ చిట్కా ఫాలో అవ్వండి

Childrens Phone Usage : పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ చూస్తున్నారా..? ఈ చిట్కా ఫాలో అవ్వండి

సెలవుల్లో పిల్లలను ఎంగేజ్ చేయడానికి తల్లిదండ్రులు వారికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కుదిరితే మొబైల్ ఫోన్ లేదంటే టీవీలు ..ల్యాప్ టాప్ లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. యితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న సంగతి తెలిసిందే.

కళ్ళు దెబ్బతింటాయి అలాంటి వాళ్ళకి ఇదే సరైన చిట్కా. పెరిగిపోతున్న ఎండలకి పిల్లలను బయటకు తీసుకెళ్లాలన్నా తీసుకోలేని పరిస్థితి. అందుకే ఇంటిపట్టున తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి. మరీ ముఖ్యంగా తండ్రి ఉద్యోగం చేస్తున్నప్పుడు తల్లి ..తల్లి ఉద్యోగం చేస్తున్నప్పుడు తండ్రి కొంచెం సేపు పిల్లలకి ఏదైనా ఆక్టివిటీస్ చెప్పడం మంచిది. బొమ్మలు వేయమని.. లేదంటే పజిల్ గేమ్స్ ఆడిపించేలా కొన్ని కొన్ని ఇండోర్ గేమ్స్ ను ప్లాన్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా కనీసం వారంలో ఒక్కసారైనా సరే పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్లకు కథలు చెబుతూ ఈరోజు నువ్వు ఏం చేసావు..? అనే విధంగా మాట్లాడుతూ పిల్లల్ని దగ్గర తీసుకుంటే .. వాళ్ళు మొబైల్ ఫోన్స్ కి ఎక్కువగా అలవాటు పడరు.

ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకు కొన్ని కొన్ని ఇండోర్ గేమ్స్ నేర్పించడం అదేవిధంగా వాళ్లలోని టాలెంట్ ని.. బయటపెట్టేలా కొన్ని కొన్ని డ్రాయింగ్స్ బొమ్మలు తయారు చేసే విధానాలను నేర్పించడం చాలా చాలా మంచిది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగేలా వాళ్ల గురించి కొన్ని సెంటెన్సెస్ రాయమని చెప్పండి. వాళ్లను మాటలతోనే.. యాక్టివిటీస్ తోనే ఎంగేజ్ చేస్తే మొబైల్స్, టీవీల వైపు చూడనే చూడరు.

Tags

Read MoreRead Less
Next Story