Summer Itch Tips : వేసవిలో చెమట పొక్కులా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

Summer Itch Tips : వేసవిలో చెమట పొక్కులా..   ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

వేసవిలో చెమట పొక్కులు వేధించడం సహజం. అయితే వాటి బాధ నుంచి ఇవిగో ఈ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు.

మెత్తగా పొడి చేసిన ఓట్లను చల్లని నీళ్లతో నింపిన స్నానాలతొట్టిలో వేసి కలపాలి. నీళ్లు పాల రంగులోకి మారాక స్నానాలతొట్టిలో 30 నిమిషాలు సేదతీరాలి. తర్వాత మెత్తని టవల్‌తో తడి అదుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చెమట పొక్కులు వదులుతాయి.

వస్త్రంలో ముంచు ముక్కలు మూటగట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి చేస్తూ ఉంటే 3 రోజులకి చెమట పొక్కులు మరింత పాకకుండా తగ్గిపోతాయి.

గంథం పొడి, గులాబీనీరు సమపాళ్లలో కలిపి సమస్య ఉన్న ప్రదేశంలో పూయాలి. పూర్తిగా ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.

ఒక కప్పు చల్లని నీళ్లలో ఒక టీస్పూను బేకింగ్‌ సోడా కలిపి, ఆ నీళ్లలో పలుచని వస్త్రం నానబెట్టి పిండేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద 10 నిమిషాలు ఉంచినా ఉపశమనం కలుగుతుంది.

ముల్తాని మట్టికి రోజ్‌వాటర్‌ చేర్చి ముద్దలా చేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద పూసి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి.

లేత వేప ఆకుల్ని మెత్తగా నూరి పూసి ఆరాక చల్లని నీటితో కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.

వేప ముద్దకు అర కప్పు శనగపిండి, కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేయాలి. దీన్ని పూసి ఆరాక కడిగేసుకోవాలి.

చెమట పొక్కులు రాకుండా ఉండాలంటే తరచుగా చల్లనీళ్లతో ఒంటిని కడుగుతూ ఉండాలి.

పుచ్చకాయ గుజ్జును పూసి ఆరాక కడిగేసుకోవాలి

కర్పూరాన్ని పొడి చేసి తగినంత వేప నూనె చేర్చి ముద్దలా తయారుచేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న ప్రాంతంలో రాసి 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

రోజుకో గ్లాసు చెరుకు రసం తాగినా చెమట పొక్కులు రాకుండా ఉంటాయి.

కలబంద గుజ్జును పూసినా ఉపశమనం కలుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story