Coffee : కాఫీ తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలంటే

Coffee : కాఫీ తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలంటే

● కాఫీ తాగటం వల్ల మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది. మృదుత్వం వస్తుంది. చర్మంలోని కణజాలాలను మెరుగు పరిచే లక్షణాలు కాఫీలోని కెఫీన్‌కు ఉంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. చర్మంలో ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది.

● కాఫీ అనేది డైయూరిటిక్‌ పానియం. ఇది తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగిపోతాయి. పొట్ట శుభ్రంగా ఉంటుంది.

● ఊబకాయం తగ్గించే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా బ్లాక్‌ కాఫీ తాగటం వల్ల శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోతాయి. ఈ విధంగా బరువును తగ్గించే గుణం కాఫీకి ఉందనమాట!

● అలసట ఉండటం.. విశ్రాంతి లేకుండా ఉండేవారు కాఫీ తాగితే అలసట కనపడదు. కాస్త చురుగ్గా అనిపిస్తుంది.

● కాఫీ గింజల్లో ఫ్రీ రాడికల్స్‌ ఉంటాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్‌ వల్ల చర్మంలో ముడతలు, వలయాలు రావు.

● కాఫీ తాగటం అంటే ఒత్తిడిని తగ్గించుకోవటమే. కాస్త కాఫీ తాగగానే వెంటనే ఒంట్లో చురుకు వస్తుంది. కాఫీలో ఉత్తేజపరిచే లక్షణం ఉంది.

● కాస్త తలనొప్పిగా ఉండే కాఫీ తాగితే సరిపోతుంది అంటారు. ఇది నిజమే. కాఫీ వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా మెదడు చురగ్గా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి అలవడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story