Cramps in Legs : రాత్రిపూట కాళ్లు, చేతులకు తిమ్మిర్లు.. మీకు ఈ లోపం ఉన్నట్లే..?!

Cramps in Legs : రాత్రిపూట కాళ్లు, చేతులకు తిమ్మిర్లు.. మీకు ఈ లోపం ఉన్నట్లే..?!

చాలామందిలో రాత్రి పడుకున్నప్పుడు కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతుంటాయి. కాసేపు అటు, ఇటు తిరిగితే సెట్ అవుతుంటుంది. ఒకటి, రెండు నిమిషాల్లో కోలుకున్నప్పటికీ.. కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. కండరాల్లో రక్తప్రసరణ జరగకపోతే అలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.

ఇది ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి పదిమందిలో ఏడు మందికి ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది నిద్రిస్తున్న సమయంలో, మరి కొంతమంది కూర్చున్న సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలో కాళ్లు , చేతులు తిమ్మిర్లు రావడానికి అసలు కారణం విటమిన్ బి12 లోపమని తెలుస్తుంది. దీని తీవ్రత క్రమంగా పెరిగి కాళ్ల నెప్పులకు దారితీస్తుంది. విటమిన్ బి12 లోపంతో చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు.

సహజంగా మాంసాహారం తీసుకోవడం వల్ల బీ12 విటమిన్ పుష్కలంగా అందుతుంది. మేక, గొర్రెలో అధిక శాతం బి12 ఉంటుంది. సి ఫుడ్, చేపల, ఎగ్స్‌తో బీ12 సమృద్ధిగా లభిస్తుంది. శాఖాహారులు అయితే ఆకుకూరలు, పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపానికి చెక్ పెట్టవచ్చు. పాలు, పెరుగు, జున్ను లేదా పులిసిన మజ్జిగలో బి12 సమృద్ధిగా లభిస్తుంది. పిస్తా, బాదంలా డ్రై ఫ్రూట్స్ లో కూడా ఇది ఉంటుంది. మంచినీటిలో కూడా బీ12 సమృద్ధిగా లభిస్తుంది. నీళ్లు తాగితే ఏ సమస్యా ఉండదని అందుకే చెబుతారు.

Tags

Read MoreRead Less
Next Story