Health : డిన్నర్ చేశాక స్వీట్లు తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే

Health : డిన్నర్ చేశాక స్వీట్లు తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే

చాలామందికి రాత్రి భోజనం చేసేసిన తర్వాత ఏదైనా ఒక డెజర్ట్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది. కానీ.. ఇది బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్వీట్స్ తిన్నాకే డిన్నర్ కంప్లీట్ అవుతుందన్న వాళ్లు భ్రమల్లో ఉన్నట్టేనని చెబుతున్నారు.

రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెప్తున్నారు. రాత్రి స్వీట్ లు తినడం వల్ల శరీరంలో ఎన్నో రకాల హానికారక సమస్యలు తలెత్తుతాయట. రాత్రి భోజనం తర్వాత తీపి వంటకాలు తినడం వల్ల బరువు పెరిగే సమస్య ఏర్పడుతుంది. స్వీట్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచి బాడీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

రాత్రి భోజనం తర్వాత స్వీట్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరిగి ఒబేసిటీ సమస్య వస్తుంది. జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావం కలుగుతుంది. జీర్ణశక్తి పాడైతే రక్తప్రసరణ నియంత్రించే సిస్టం దెబ్బతింటుంది. గుండెపై ప్రభావం పడుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ప్రమాదం కలుగుతుంది. నిద్ర కూడా సరిగా పట్టదంటున్నారు ఎక్స్ పర్ట్స్. నైట్ లో భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్‌ సడెన్ గా మార్పు వస్తుందని.. అది పెరగడం కానీ..తగ్గడం కానీ జరగొచ్చంటున్నారు. అందుకే డిన్నర్ తర్వాత స్వీట్స్ అవాయిడ్ చేయండి.

Tags

Read MoreRead Less
Next Story