Mosquito : దోమల బెడద తగ్గించే చిట్కాలివే..

Mosquito : దోమల బెడద తగ్గించే చిట్కాలివే..

మండే ఎండల్లో కొన్ని ఏరియాల్లో దోమల బెడద ఉంటుంది. వీటి నుంచి రక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దోమలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ సీజన్ లో దోమల బారిన పడితే.. మలేరియా, డెంగూ, జికా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.

దోమలు ఎక్కువగా యాక్టివ్ గా ఉండే టైం సాయంత్రం నుంచి ఎర్లీ మార్నింగ్. రాత్రి 2 నుంచి పొద్దున 5 వరకు కూడా దోమలు యాక్టివ్ గా ఉండవు. ఆ సమయంలో తలుపులు, కిటికీల నుంచి ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా వాటికి అడ్డుగా మెష్ పెట్టుకోండి. స్ప్రేయర్లు, రిప్లెంట్లతోనూ దోమలను నివారించవచ్చు.

నిమ్మకాయ, యూకలిప్టస్ నూనెను కూడా దోమలను తగ్గించుకోవడం కోసం వినియోగించవచ్చు. దోమలు కుట్టకుండా పిల్లలకు కాటన్ దుస్తులను ఫుల్​ హ్యాండ్స్ ఉన్నవి వేయాలి. దోమలు ఎక్కువగా కాళ్ల చుట్టూ తిరుగుతాయి కాబట్టి.. ఫుల్ ప్యాంట్స్.. పాదాలకు రక్షణగా సాక్స్ వేసుకుంటే దోమల నుంచి కాపాడుకోవచ్చు. నిల్వ ఉన్న నీళ్ల నుంచి లార్వాలు పుట్టి అక్కడినుంచి ఉద్భవిస్తాయి. కాబట్టి మీ ఇంట్లో దోమలను మీరే పెంచిపోషించవద్దు. డస్ట్ బిన్ ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి.

Tags

Read MoreRead Less
Next Story