Protein Food : ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రొటీన్‌ఫుడ్‌ అవసరం

Protein Food : ఎముకలు, చర్మం, జుట్టు  ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రొటీన్‌ఫుడ్‌ అవసరం

మంచి ప్రొటీన్‌ ఫుడ్‌ తింటే కండ గట్టిగా ఉంటుంది. అంతేనా... కణజాల వ్యవస్థను నిర్మించటానికి, ఎంజైమ్‌ల ఉత్పత్తికి దోహదపడుతుంది. కండరాలతో పాటు ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్‌ఫుడ్‌ తినటం అవసరం.

* ప్రొటీన్‌ అంటేనే మనకు గుర్తొచ్చేది కోడిగుడ్లు. ఒక్కో కోడి గుడ్డులోని తెల్లసొనలో నాలుగు గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. పచ్చసొనతో పోలిస్తే తెల్లసొనలో మంచి ప్రొటీన్‌ ఉంటుంది.

* సాల్మన్‌ చేపల్లో 22 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. ఇవి తినటం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు.

* ఇరవై ఎనిమిది గ్రాముల ఆల్మండ్స్‌లో ఆరు గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అందుకే వీటిని ప్రతిరోజూ రాత్రి నానబెట్టి కనీసం రెండు లేదా మూడు ఆల్మండ్స్‌ను తినటం మంచిది. జీడిపప్పును కూడా తింటే ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

* పాలు, పెరుగు, వెన్నల్లో కూడా ప్రొటీన్‌ ఉంటుంది. అందుకే పిల్లలయినా, పెద్దలయినా పాల ఉత్పత్తులను తినటం మంచిదే.

* చికెన్‌, మటన్‌లో కూడా హై ప్రొటీన్స్‌ ఉంటాయి. అయితే వీటితో పాటు శాకాహారంలో కూడా మంచి ప్రొటీన్లు ఉంటాయి. అవే గుమ్మడి గింజల్లో మంచి ప్రొటీన్లు ఉంటాయి. వంద గ్రాముల వేరుశనగల్లో 25 గ్రాముల ప్రొటీన్లు దొరుకుతాయి.

* సోయా ఉత్పత్తులైన సోయా పాలు, సోయా పెరుగు, సోయా బీన్స్‌లో ప్రొటీన్ల శాతం ఎక్కువే.

* వంద గ్రాముల పనీర్‌లో 18 గ్రాములు ప్రొటీన్లు ఉన్నాయి. సన్‌ఫ్లవర్‌ విత్తనాలు కూడా ప్రొటీన్లు కలిగి ఉంటాయి.

* నూనెలో వేయించిన చీజ్‌, బటర్‌ను తినకూడదు. ప్రొటీన్లు అధికంగా తింటే కొవ్వు పదార్థాలు వచ్చి గుండె సంబంధ వ్యాధులు వస్తాయనే మాట అపోహ మాత్రమే. అయితే మరీ మితిమీరి ప్రొటీన్‌ ఫుడ్‌ తినొద్దు. ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకున్నాక సరైన వ్యాయామం చేయాలి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story