Heart Tips : ఈ ఐదు అలవాట్లు పాటించండి.. మీ గుండె ఇక పదిలం

Heart Tips : ఈ ఐదు అలవాట్లు పాటించండి.. మీ గుండె ఇక పదిలం

ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని అంటున్నారు. వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్ ను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. ఆ సూచనలు ఇవి.....

శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా లభించే ఆలివ్ ఆయిల్, ఆవనూనె, అవిసెగింజల నూనె వంటి వాటిని తీసుకోవాలి. వీటి మోతాదు నెలకు అర లీటరు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు నట్స్, ప్రొటీన్ ఫుడ్, పీచుపదార్థం అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం వీలైనంత తక్కువ తినాలి. ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారంలో ఐదు సార్లు ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని వెల్లడైంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్

లెవెల్స్ తగ్గుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం గుండె జబ్బులకు స్మోకింగ్, ఆల్కహాల్ కారణమవుతున్నాయి. ఈ అలవాట్లు లేని వారితో పోలిస్తే అలవాటు ఉన్న వారిలో 50 శాతం రిస్క్ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు మానేయాలి.

* నిద్ర మానసిక ఆరోగ్యానికే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. ఈ అలవాట్లతో పాటు క్రమంతప్పకుండా పరీక్షలు | చేయించుకోవాలి. బి.పి, కొలెస్ట్రాల్ లెవెల్స్, కిడ్నీ, లివర్, థైరాయిడ్ పనితీరు పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ఈసీజీ వంటి పరీక్షలు చేయించాలి.

గుండెకు మేలు చేసే ఫుడ్

నిమ్మ పండులో పోషకాలు పుష్కలం. చవకగా లభించే దానిమ్మ పండు అందరూ తినదగినది.

* దానిమ్మ గింజలు తింటే రక్తవృద్ధి కలుగుతుంది. దీంతోపాటు రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. హైబీపీ ఉండదు. గుండెకు మేలు చేస్తుంది.

* నొప్పుల నివారిణి. దీంతో పాటు ఈ పండు తింటే చర్మం మృదువుగాతయారవుతుంది.

* డయాబెటీస్ ఉండే వారు ఈ పండును తినటం మంచిది. జీర్ణశక్తినిపెంచుతుంది.

* జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది.

* వీటిని తింటే ఎముకల్లో గట్టిదనం వస్తుంది.

* దానిమ్మలో విటమిన్ సి, పొటాషియం ఉంటుంది. నిద్రలేచిన వెంటనే ఉండే సిక్నెస్ తొలగిపోతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

* సాధారణంగా జ్యూస్ చేసుకుని తాగడం కంటే దానిమ్మ పండును తినటమే ఆరోగ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

* కడుపులో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.

* నోటిలోని బ్యాక్టీరియాల్ని చంపేస్తుంది. నోటి పూత, చిగుళ్ల రక్తస్రావంను తగ్గిస్తుంది.

* దానిమ్మ రసాన్ని చర్మం మీద ఉండే పొక్కులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. * దానిమ్మ బెరడు, తోలు, ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివే.

Tags

Read MoreRead Less
Next Story