Hair Tips : మార్కెట్లో క్రీమ్స్‌ వాడకుండా ఇంట్లోని జుట్టు సంరక్షణ ఇలా చేసుకోండి

Hair Tips : మార్కెట్లో క్రీమ్స్‌ వాడకుండా ఇంట్లోని జుట్టు సంరక్షణ ఇలా  చేసుకోండి

మార్కెట్లో దొరికే క్రీమ్స్‌ కాకుండా మన ఇంట్లోని వంటగదిలో ఉండే వాటితోనే హెయిర్‌మాస్క్‌లు వేసుకోవచ్చు. ముఖ్యంగా సహజసిద్ధమైన మాస్క్‌లు వేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

* బౌల్‌లో నాలుగు టేబుల్‌స్పూన్లు తాజా అలొవెరా జెల్‌ను, రెండు టేబుల్‌ స్పూన్లు కొబ్బరినూనె కలిపి మిక్స్‌ చేయాలి. దీన్ని మాడుకు పట్టేలా పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు అందం, ఆరోగ్యంగా ఉంటుంది.

* టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక పచ్చి అరటిపండును మెత్తగా చేసుకోవాలి. రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె కూడా తీసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కలిపి జుట్టుకు పట్టిస్తే కుదుళ్లు గట్టిగా ఉంటాయి.

* రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీని వల్ల జుట్టులో చుండ్రు పోతుంది.

* రెండు ఉల్లిపాయలను గ్రైండ్‌ చేసి, అందులో కొబ్బరినూనె టీస్పూన్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జుట్టు ఊడిపోదు.

* ప్యాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె, గుప్పెడు కరివేపాకు వేసి వేడిచేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు పెరుగుతుంది.

* రెండు టేబుల్‌ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పేస్ట్‌ చేయాలి. ఇందులోకి టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జుట్టు గట్టిగా ఉంటుంది.

* బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టీస్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను తరచూ పట్టిస్తుంటే తల చల్లగా ఉంటుంది. జుట్టులోని దురద తగ్గుతుంది.

* గుప్పెడు మందార పూలను పేస్ట్‌గా చేయాలి. ఇందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత మైల్డ్‌ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుతుంది.

* ఒక కోడిగుడ్డు వైట్‌తో పాటు టీస్పూన్‌ నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని కలపాలి. దీన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టులో ఫ్రెష్‌నెస్‌ వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story