Morning Walk Benefits : ఉదయం నడకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Morning Walk Benefits : ఉదయం నడకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయం నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. మానసికంగా దృఢంగా తయారవుతారు. ఇంకా ఏం ప్రయోజనాలు చేకూరుతాయంటే...

* రోజూ పార్కులో కనీసం 20 నిమిషాలు నడిస్తే రోజంతా హుషారుగా ఉంటారని, మానసిక ఒత్తిడి దరిచేరదని అధ్యయనంలో తేలింది. కాబట్టి ఇండోర్ వాకింగ్ కన్నా అవుట్ డోర్ వాకింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.

* ఉదయం నడక వల్ల ఆందోళన తగ్గుతుంది. డిప్రెషన్, ఒత్తిడి వంటివి దూరమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారంలో కనీసం ఐదు రోజులు రోజూ అరగంట పాటు నడిచినా మంచి ఫలితం ఉంటుంది.

•బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఉదయం నడకను అలవాటు చేసుకోవాలి. అరగంట నడవడం వల్ల 150 క్యాలరీలు ఖర్చవుతాయి. నడకతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

•నడక వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. రోజూ అరగంట నడిచే వారిలో గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం 19 శాతం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.

•డయాబెటిస్ తో బాధపడుతున్న వారు నడకను దినచర్యగా పెట్టుకోవాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటానికి ఉదయం నడక బాగా ఉపయోగపడుతుంది.

* ఉదయం నకడ వల్ల జీవితకాలం పెరుగుతుంది. కాళ్ల కండరాలు బలోపేతం అవుతాయి.

* మానసిక సామర్థ్యం పెరుగుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యంపై దృష్టి సారించగలుగుతారు. క్రియేటివ్ ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. ఉదయం నడక కొత్త కొత్త ఐడియాలను పుట్టిస్తుందని అధ్యయనాల్లోనూ తేలింది. నిద్రలేమితో బాధపడే వారికి ఉదయం నడక పరిష్కారం చూపుతుంది. క్రమంతప్పకుండా వాకింగ్ చేసే వారు గాఢనిద్ర పోతారు.

Tags

Read MoreRead Less
Next Story