Sleep : మనిషి ఆరోగ్యం బాగుండాలంటే ఎంత నిద్ర అవసరం ?

Sleep : మనిషి ఆరోగ్యం బాగుండాలంటే ఎంత నిద్ర అవసరం  ?

జీవక్రియలు సాఫీగా జరగాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే, రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. నిద్రే శక్తిని ఇస్తుంది. మనల్ని తాజాగా ఉంచుతుంది. చురుకుగా తయారు చేస్తుంది. ఆరోగ్యం బావుండాలంటే ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం.

* ఎక్కువగా పని చేయటం వల్ల కూడా నిద్రలే మితో బాధపడతారు. ఈ ప్యాండమిక్ సిచ్యువేషన్లో కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మీటింగ్ జరిగే సమయాలు మారుతాయి. ప్రొఫెషనల్ బౌండరీస్ దాటి పని చేస్తారు. ఇలా చేయడం వల్ల సరైన సమయంలో ఆహారం తినే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పాటు వేళకు నిద్రపోయేందుకు సమయం అనుకూలించదు. ఈ విషయాన్ని అధికమిస్తే నిద్రకి డోకా ఉండదు.

* కొందరు వయసుతో సంబంధం లేకుండా అధి కంగా శారీరకశ్రమ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల సరైన నిద్రరాదు. చెమట రాలేట్లు పనిచేయాలి కానీ అధిక పనిచేస్తే నిద్రలేమితో బాధపడాల్సిందే.

* కంప్యూటర్ తెర లేదా ఫోన్ తెరను అస్తమానం చూస్తే కళ్లకు ఇబ్బంది. దీంతో పాటు మెదడులో కూడా చర్యలు జరుగుతాయి. మెలనిన్ ఉత్పత్తి జరు గుతుంది. అందుకే స్క్రీన్ టైమ్ ను సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. ఫోన్లో అధిక సమయం మాట్లా డటం తగ్గించాలి. వీటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యకర మైన నిద్ర కలుగుతుంది.

* కొందరు నిద్రకు ముందు అధికంగా తింటారు. ఇలా తినటం వల్ల కూడా సమస్య ఉంటుంది. మరికొం దరు క్వాలిటీ ఫుడ్ తినకుండా.. ఏదో చిరుతిల్లు తిని పడుకుంటారు. వీరిద్దరికీ నిద్ర సరిగా పట్టదు. ఈ రెండు పద్ధతులు కాకుండా నిద్రకు ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తింటేనే నిద్ర పడుతుంది. ఉదయాన లేచాక చురుగ్గా ఉంటాం.

* కొందరు యాంగ్జయిటీ, ఒత్తిడి, భయంతో బాధ పడుతుంటారు. అనవసరమైన ఒత్తిడికి గురవుతుం టారు. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి చిన్న దానికి భయపడే జనాలెక్కువ. ఇలాంటి వారికి నిద్ర సరిగా పట్టదు. మానసికంగా సరిగా లేకుండా ఎంత ఆహారం తీసుకున్నా.. ఏమి తిన్నా ఉపయోగం లేదు. ఒంటికి సరిపోదు. నిరంతరం మానసిక సమస్యలతో బాధపడుతుంటే నిద్రలో పలుసార్లు డిస్టర్బ్ కలుగు తుంది. ఒత్తిడిని తగ్గించి, కూల్ గా ఉంటూ.. టేక్ ఇట్ ఈజీ పాలసీతోనే ఉంటేనే.. ఆరోగ్యకరమైన నిద్ర పడు తుంది. ఆరోగ్యకరమైన నిద్రనే మనిషి జీవితాన్ని నిర్ణ యిస్తుందని మర్చిపోకూడదు.

Tags

Read MoreRead Less
Next Story