Accident: ఫంక్షన్ నుంచి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదం.. 11 మృతి

Accident: ఫంక్షన్ నుంచి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదం.. 11 మృతి
ఛత్తీస్‌గఢ్‌లో ట్రక్కును పికప్ వాహనం ఢీకొనడంతో 11 మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.

Accident: ఛత్తీస్‌గఢ్‌లో ట్రక్కును పికప్ వాహనం ఢీకొనడంతో 11 మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో పికప్ వాహనం ట్రక్కును ఢీకొనడంతో 11 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. "పికప్ వాహనం ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. భటపరా (రూరల్) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది" అని పోలీసులు తెలిపారు.

మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని రాయ్‌పూర్‌కు తరలించినట్లు సమాచారం. "స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, వారిలో కొందరిని మెరుగైన వైద్య సహాయం కోసం రాయ్‌పూర్‌కు పంపించారు".

ఇదే నెలలో, ఫిబ్రవరి 9న చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో పాఠశాల పిల్లలను తీసుకెళ్తున్న ఆటో-రిక్షా ట్రక్కును ఢీకొనడంతో 7 మంది పాఠశాల విద్యార్థులు మరణించగా, ఒక చిన్నారి మరియు ఆటో డ్రైవర్ గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని కోరార్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. "ఆటో రిక్షాలో ఎనిమిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు పాఠశాల నుంచి ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రక్కు స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్ధులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు విద్యార్ధులు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. "ఒక విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్‌ పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉంది. ఈ యాక్సిడెంట్ జరిగి పది రోజులు కూడా కాలేదు మళ్లీ ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకోవడం దురదష్టకరం.

Tags

Read MoreRead Less
Next Story