Corona Cases In India: ఇండియాలో కరోనా కొత్త వేరియంట్.. వరుసగా నమోదవుతున్న కేసులు..

Corona Cases In India: ఇండియాలో కరోనా కొత్త వేరియంట్.. వరుసగా నమోదవుతున్న కేసులు..
Corona Cases In India: మనదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై 4.2 వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది.

Corona Cases In India: మనదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై 4.2 వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఈ వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగిలిన నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు. ఏవై.4.2 కేసులు వెలుగు చూడటంతో అప్రమత్తమయ్యారు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు.

ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు.. ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్​కు వీటిని పంపినట్లు పేర్కొన్నారు.

ఈ వేరియంట్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జన్యు పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రంలో ఆరు లేదా ఏడు ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అటు కేరళలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 7,163 మందికి వైరస్​ నిర్ధారణ అయింది. మరో 482 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

కొత్త కేసులతో కలిపి కర్ణాటకలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 49,19,952కు చేరగా... మరణాల సంఖ్య 29,355కు పెరిగింది. తమిళనాడులో కొత్తగా దాదాపు 11 వందల కరోనా కొత్త కేసులు బయట పడ్డాయి. వైరస్ కారణంగా మరో 15 మంది మృతి చెందారు. కొత్తగా 1,326 మంది వైరస్​ను జయించారు. ఒడిశాలో కొత్తగా 433 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story