దేశంలో 10లక్షలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

దేశంలో 10లక్షలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,337

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 53,08,015కు చేరాయి. అయితే, ఇందులో 42,08,432 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా, 10,13,964 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో నమోదవుతున్న కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో కరోనా కాటుకి బలై 1247 మంది మ‌ర‌ణించారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనాతో మృతిచెందిన‌వారి సంఖ్య 85,619కు పెరిగింది

Tags

Read MoreRead Less
Next Story