దేశంలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 92,605 మందికి కరోనా

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. గత కొన్ని రోజులుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. గత కొన్ని రోజులుగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 92,605 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 54,00,620 చేరింది. ఇప్పటివరకూ 43,03,044 కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 10,10,824 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజులో కరోనాతో 1,133 మంది మరణించగా.. క‌రోనా మృతులు 86,752కు చేరాయని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా రికవరీ రేటు భారత్ లో నమోదవుతుంది. అటు, కరోనా పరీక్షలు ఎక్కువగా జరగటం వలన కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్నాయని.. ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని నిపులణులు చెబుతున్నారు. ఈ ఒక్కరోజే 12,06,806 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Tags

Read MoreRead Less
Next Story