Heeraben Modi Death: ఆమెను మించిన ఆస్తి లేదు నాకు: అశ్రునయనాలతో అమ్మకు నివాళి అర్పించిన మోదీ

Heeraben Modi Death: ఆమెను మించిన ఆస్తి లేదు నాకు: అశ్రునయనాలతో అమ్మకు నివాళి అర్పించిన మోదీ
Heeraben Modi Death: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. గత కొన్ని రోజులుగా హీరా బెన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Heeraben Modi Death: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. గత కొన్ని రోజులుగా హీరా బెన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో.. హీరాబెన్‌ను బుధవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు.


ఇక 18 జూన్‌ 1923లో జన్మించిన హీరాబెన్‌..గత జూన్‌లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. అమె భర్త పేరు దామోదర్‌దాస్‌ మూల్‌చంద్‌ మోదీ,ఆమెకు ఐదుగురు కుమారులు,ఒక కుమార్తె ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని ప్రధాని సోదరుడి నివాసంలో ఉంటున్నారు హీరాబెన్‌.


ప్రధాని మోడీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మను మించిన ఆస్తి నాకు లేదు. మా అమ్మ జీవితంలో ఎన్నడూ బంగారు నగలు వేసుకోలేదు. వాటిపై ఆమెకు పెద్ద ఆసక్తి లేదు. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఆమె ఒక చిన్న గదిలో సాదాసీదా జీవనం సాగిస్తోంది అని బ్లాగ్ పోస్ట్ లో మోదీ పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. డిసెంబర్‌లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ను కలిశారు, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.



గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చొని టీ తాగారు. గుజరాత్ ఎన్నికలకు ముందు, జూన్ 18న తన 100వ పుట్టినరోజు సందర్భంగా మోడీ తన తల్లిని కలిశారు.


ఇక ఇంటిని నడిపేందుకు మా అమ్మ చెమట చిందించిన క్షణాలు నాకు బాగా గుర్తున్నాయి. ఇరుగుపొరుగు ఇళ్లకు వెళ్లి మా అమ్మ గిన్నెలు కడిగే పని చేసేది. ఇంటి ఖర్చులు వెళ్లదీయడానికి చరఖా నడిపే పని కూడా అమ్మ చేసేది. వర్షాకాలంలో ఇల్లు కురుస్తుంటే.. ఆ నీరు ఇంట్లో పడకుండా మా అమ్మ బకెట్లు, పాత్రలు పెట్టేది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. పెద్దగా చదువుకోకున్నా.. పెద్దగా ఆలోచించవచ్చని మా అమ్మ నిరూపించింది. మా అమ్మ ఆలోచన విధానం, ముందుచూపు నాలో నిత్యం స్ఫూర్తి నింపేవి అని ప్రధాని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

హీరాబెన్‌ అంత్యక్రియలు ఈ తెల్లవారుజామున ముగిశాయి. అశ్రునయనాలతో తన తల్లి పాడె మోసిన ఆయన సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి తన తల్లికి తలకొరివి పెట్టారు ప్రధాని.వందేళ్ల పరిపూర్ణ జీవితాన్ని చవి చూసిన తన తల్లికి కడసారి వీడ్కోలు తెలిపారు.

ప్రధాని మోదీ తల్లి మరణం పట్ల దేశ విదేశాల నుంచి ప్రముఖులు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాత్, తెలుగు రాష్ట్రాల సీఎంల తో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం ప్రకటించారు.


100 ఏళ్ల పాటు జీవించిన తన తల్లి.. ఇప్పుడు ఈశ్వరుడి పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలను అమ్మలో ఉన్నాయని అన్నారు. తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా కలిసినప్పుడు.. ఆమె తనతో చెప్పిన ఓ మాటను ఆయన గుర్తు చేసుకున్నారు. బుద్ధితో పనిచేయాలి. శుద్ధిగా జీవించాలి. అని తనకు చెప్పారని.. ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.


ఇక ప్రధాని మోడీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు తల్లిని కలసి ఆమె ఆశ్వీర్వాదం తీసుకోవడం మోదీ సెంటిమెంట్‌గా భావిస్తారు.


మా అమ్మ అందరిలా సామాన్యమైనదే.. కానీ ఆమె ఒక అసాధారణ మహిళ అని గట్టిగా చెప్పగలను. మా అమ్మ చిన్న వయసులో ఉండగానే తల్లిని కోల్పోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురీదింది. వాటిని ఎదుర్కొని ధైర్య శాలిగా నిలిచింది. జీవితంలో గెలిచింది. నా కోసం మా అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది. మా అమ్మలోని గొప్ప సుగుణాలే నా మనసు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాలకు ఒక రూపం ఇచ్చాయి. గుజరాత్ లోని వడ్ నగర్ లో మేము నివసించిన పెంకుటిల్లును, దాని మట్టి గోడలను నేటికీ మర్చిపోలేదు. నా తోబుట్టువులతో కలిసి అక్కడే పెరిగి పెద్దయ్యాను అని మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story