Delhi: ఏడునెలలుగా అపస్మారకస్థితిలోనే.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Delhi: ఏడునెలలుగా అపస్మారకస్థితిలోనే.. అయినా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Delhi: రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. 7 నెలల నుంచి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతోంది. అయినా గత వారం ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Delhi: రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. 7 నెలల నుంచి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతోంది. అయినా గత వారం ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

న్యూరోసర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ, " 23 ఏళ్ల యువతి 2022 ఏప్రిల్ 1న తెల్లవారుజామున 4.30 గంటలకు తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తలకు బలమైన గాయం కావడంతో ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వచ్చింది. యుపిలోని బులంద్‌షహర్‌ వద్ద ప్రమాదం జరిగిన సమయంలో భార్యాభర్తలిద్దరూ హెల్మెట్ ధరించలేదు.


భర్తకు ఎలాంటి గాయాలు కాలేదు, కానీ భార్య తలకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వైద్యులు ఆమెను AIIMS ట్రామా సెంటర్‌కు రిఫర్ చేశారు. యాక్సిడెంట్‌కు ముందు ఆరు వారాల క్రితమే ఆమె వివాహం జరిగింది.


ప్రమాదం జరిగినప్పుడు 40 రోజుల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. కానీ ఆమె అపస్మారక స్థితిలో ఉంది. ఆమె మెదడుకు తీవ్రమైన గాయం కావడంతో వెంటనే వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. దెబ్బతిన్న మెదడు లోపల ఒత్తిడిని తగ్గించడానికి ఆమె పుర్రె ఎముకలో కొంత భాగాన్ని తొలగించారు వైద్యులు.


గత 7 నెలల్లో మొత్తం 5 న్యూరో సర్జికల్ ఆపరేషన్లు చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆ మహిళ అపస్మారక స్థితిలోనే ఉండి ఊపిరి పీల్చుకుంది. "ప్రస్తుతం, ఆమె ఎటువంటి వెంటిలేటరీ సపోర్ట్‌ లేకుండా తనంతట తానుగా శ్వాస తీసుకుంటోంది. అప్పుడప్పుడు కళ్లు తెరుస్తోంది. రాబోయే రెండేళ్లలో ఆమె స్పృహలోకి రావడానికి 10-15 శాతం అవకాశం ఉంది అని డాక్టర్ గుప్తా అన్నారు.


చాలా చర్చల తర్వాత అడ్మిషన్ సమయంలో మహిళ గర్భవతి కావడంతో, కుటుంబ సభ్యులు గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. వైద్య బృందం కుటుంబానికి గర్భాన్ని కొనసాగించాలో లేదో నిర్ణయించుకోమంది. తల్లి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గర్భాన్ని తొలగించే నిర్ణయాన్ని కుటుంబానికే వదిలివేసింది అని "డాక్టర్ గుప్తా చెప్పారు.

ఆమె అక్టోబర్ 22న AIIMS ట్రామా సెంటర్‌లో 2.5 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన ఆడపిల్లకు నార్మల్ డెలివరీ ద్వారా జన్మనిచ్చింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ప్రసూతి మరియు గైనకాలజీ విభాగానికి చెందిన బృందం ప్రసవాన్ని నిర్వహించింది అని డాక్టర్ గుప్తా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story