UPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ రిలీజ్

UPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ రిలీజ్

సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)-2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి మార్చి 05 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తులు స్వీకరించనుంది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. దీంతో పాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

విద్యార్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్థుల వయసు 21నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.

ఫీజు: ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)

ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఈ ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు.

మెయిన్స్‌ పరీక్ష: ఇది డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్‌, వరంగల్‌

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

Tags

Read MoreRead Less
Next Story