Bank of Maharashtra Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. జీతం రూ. 63840

Bank of Maharashtra Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. జీతం రూ. 63840
Bank of Maharashtra Recruitment 2022: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

Bank of Maharashtra Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) స్కేల్ 2 మరియు 3లో జెనరలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 5, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తుదారులు ఫిబ్రవరి 22, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 05, 2022

ఆన్‌లైన్ అప్లికేషన్ ముగుస్తుంది: ఫిబ్రవరి 22, 2022

పరీక్ష తేదీ: మార్చి 12, 2022

ఖాళీ వివరాలు

మొత్తం: 500 పోస్టులు

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్-II: 400 (UR-162, SC-60, ST-30, OBC-108, EWS-40)

జనరల్ ఆఫీసర్ స్కేల్-III: 100 (UR-41, SC-15, ST-7, OBC-27, EWS-10)

అర్హత..

విద్యార్హత: SC/ST/OBC/PwBD అభ్యర్థులు కనీసం 55%, CA/CMA/CFAలో కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి

25 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పే స్కేల్

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్-II: రూ. 48170 – (1740/1) – 49910 – (1990/10) – 69810.

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్-III: రూ. 63840 – (1990/5) – 73790 – (2220/2) – 78230.

దరఖాస్తు రుసుము

UR / EWS / OBC: రూ 1180

SC / ST 100: రూ 118

దరఖాస్తు చేసుకునే విధానము..

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 22, 2022లోపు అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story