Indian Navi:ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ అర్హత ఉంటే అప్లై..

Indian Navi:ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ అర్హత ఉంటే అప్లై..
Indian Navi: ఈ నోటిఫికేషన్ ద్వారా కొచ్చిలోని నేవల్ షిప్‌యార్డులో ఉన్న అప్రెంటీస్ ట్రైనింగ్ స్కూల్లో 230 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

Indian Navi Jobs: ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొచ్చిలోని నేవల్ షిప్‌యార్డులో ఉన్న అప్రెంటీస్ ట్రైనింగ్ స్కూల్లో 230 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెకానిక్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు 2021 అక్టోబర్ 1 ఆఖరు తేదీ. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 230

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 20

ఎలక్ట్రీషియన్: 18

ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 5

ఫిట్టర్ : 13

మెషినిస్ట్: 6

మెకానిక్ (మోటార్ వెహికల్): 5

మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ: 5

టర్నర్: 6

వెల్లర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 8

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 3

ఫౌండ్రీమ్యాన్: 1

షీట్ మెటల్ వర్కర్: 11

ఎలక్ట్రికల్ వైండర్: 5

కేబుల్ జాయింటర్: 2

సెక్రటేరియట్ అసిస్టెంట్: 2

ఎలక్ట్రోప్లేటర్: 6

ఫ్లంబర్: 6

ఫర్నిచర్ అండ్ కేబినెట్ మేకర్: 7

మెకానిక్ డీజిల్ : 17

మెకానిక్ (మెరైన్ డీజిల్): 1

మెరైన్ ఇంజన్ ఫిట్టర్ : 5

బుక్ బైండర్ : 4

టైలర్ (జనరల్) : 5

షిప్‌రైట్ (స్టీల్) : 4

పైప్ ఫిట్టర్ : 4

రిగ్గర్ : 3

షిప్‌రైట్ (వుడ్): 14

మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్యిప్‌మెంట్ మెయింటినెన్స్ : 3

ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్: 3

టూల్ అండ్ డై మేకర్: 1

సీఎన్‌సీ ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్: 1

డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ): 2

పెయింటర్ (జనరల్): 9

టీఐజీ లేదా ఎంఐజీ వెల్డర్: 4

పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ : 3

ఎంగ్రేవర్ : 1

పెయింటర్ (మెరైన్) : 2

మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్‌క్రాప్ట్ : 5

మెకానిక్ (ఇన్‌స్ట్రుమెంట్ ఎయిర్ క్రాప్ట్): 5

ఎలక్ట్రీషియన్ (ఎయిర్ క్రాప్ట్): 5

ముఖ్య సమాచారం:

విద్యార్హతలు: మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 21 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం : మెట్రిక్యులేషన్ లేదా టెన్త్ క్లాస్‌లో, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2021

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్

The Admiral Su[erintendent (for Officer in charge), Apprentices Training School Naval Ship Repair Yard, Naval Ship Repair Yard, Naval Base, Kochi-682004.

Tags

Read MoreRead Less
Next Story