Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు.. 12 వారాల శిక్షణతో ఫ్రెషర్స్‌ని..

Infosys Recruitment: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు.. 12 వారాల శిక్షణతో ఫ్రెషర్స్‌ని..
Infosys Recruitment: టెక్ రంగంలో ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు అద్భుతమైన అవకాశాలు

Infosys Recruitment: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కొత్త నియామకాలపై దృష్టి సారించింది. ఫ్రెషర్స్‌కి 55 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఉద్యోగంలో నియమించుకున్న అభ్యర్థులకు 12 వారాల శిక్షణ కూడా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. నియామకాల సంఖ్య ఇంకా పెరగొచ్చని ఆయన తెలిపారు. నాస్‌కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్ 2022 (NTLF) సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

టెక్ రంగంలో ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు అద్భుతమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, అయితే ఇది తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను నేర్చుకునే కెరీర్ అని ఆయన అన్నారు. కంపెనీ నైపుణ్యతపై దృష్టి పెడుతుందని అందుకే కంపెనీలో చేరే ప్రతి అభ్యర్థికి ఆరు నుండి 12 వారాల పాటు శిక్షణ ఇస్తుందని పరేఖ్ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులందరినీ తిరిగి వారి స్కిల్స్‌ని పెంపొందించుకునే ప్రోగ్రామ్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేసిందని సలీల్ అన్నారు.


ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌ని నియమించుకుని శిక్షణ ఇవ్వడం ఇదేమీ మొదటి సారి కాదు. ఇంతకు ముందు ఏడాది కూడా ఈ విధంగానే చేసింది. సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ 6 వారాల నుంచి 12 వారాల మధ్య ఉంటుంది. కోబాల్ట్, డిజిటల్ సామర్థ్యాలతో పాటు సంస్థ మెథడాలజీకి సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయనుంది. క్లౌడ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాపై అభ్యర్థులు పట్టు సాధించేలా శిక్షణ ఇవ్వనుంది.

కళాశాల విద్యార్థుల కోసం, భారీ అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, అయితే తక్కువ వ్యవధిలో కొత్త నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సిద్ధంగా ఉండాలని పరేఖ్ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story