IRCTC Recruitment 2021- పదవతరగతి అర్హతతో ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగాలు.. రేపే ఆఖరు తేదీ..

IRCTC Recruitment 2021- పదవతరగతి అర్హతతో ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగాలు.. రేపే ఆఖరు తేదీ..
IRCTC Recruitment 2021-ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.

IRCTC Recruitment 2021- ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అండ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. న్యూఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో ఈ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 10లోగా అప్లై చేయాలి. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. అప్రెంటిస్ గడువు ఒక ఏడాది మాత్రమే ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 150

విద్యార్హతలు: 10వ తరగతి పాస్ కావాలి

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2021 సెప్టెంబర్ 3

దరఖాస్తుకు చివరి తేదీ: 2021 అక్టోబర్ 10

వయస్సు: వయస్సు పరిమితి లేదు

ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు

అప్రెంటీస్ కాలం: 12 నెలలు

వేతనం: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.7000 నుంచి రూ.9,000 మధ్య ఉంటుంది.

పోస్టింగ్: ఐఆర్‌సీటీ కార్యాలయం, న్యూఢిల్లీ

ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం..

అభ్యర్ధులు ముందుగా https://apprenticeshipindia.org/వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి

హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేసి Candidate క్లిక్ చేయాలి

పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

లాగిన్ అయిన తరువాత హోమ్ పేజీలో Apprentices పైన క్లిక్ చేయాలి.

Apprentice Search లో ఐఆర్‌సీటీసీ టైప్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.

ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్ధులు నేరుగా ఈ లింక్ క్లిక్ చేసినా దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది.

ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story