Kadapa DCCB Jobs: డిగ్రీ అర్హతతో కడప డిస్ట్రిక్ కోపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం రూ.24,000

Kadapa DCCB Jobs: డిగ్రీ అర్హతతో కడప డిస్ట్రిక్ కోపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం రూ.24,000
Kadapa DCCB Jobs: ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

Kadapa DCCB Jobs: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని కడప డిస్ట్రిక్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (kadapa district co operative central bank limited) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ విభాగాల్లో 75 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kadapadccb.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్ధులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ:

దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

అందులో మెరిట్ సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం..

ఇంగ్లీషు (30 మార్కులకు), రీజనింగ్ (35 మార్కులకు), ఆప్టిట్యూడ్ (35 మార్కులకు) ఉంటుంది. 60 నిమిషాల వ్యవధిలో 100 ప్రశ్నలు పూర్తి చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం..

* దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది.

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kadapadccb.in/recruitment-2/ను సందర్శించాలి

* పోస్టుల వారీగా నోటిఫికేషన్ ఉంటుంది. వాటిని పూర్తిగా చదవాలి.

* అనంతరం అర్హత ఉన్నవారు click here to apply పైన క్లిక్ చేయాలి.

* క్లిక్ చేయగానే https://ibpsonline.ibps.in/dccbasmoct21/ లింక్ ఓపెన్ అవుతుంది.

* అడిగిన సమాచారం అందించి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

* అనంతరం జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.590 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీసీ/ఈఎక్స్ఎస్ అభ్యర్ధులు రూ.413 పరీక్ష ఫీజు చెల్లించాలి.

* దరఖాస్తుకు డిసెంబర్ 3, 2021 వరకు అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story