ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ప్రొఫెసర్ జి. రాంరెడ్డి (Professor G. Ramreddy) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (Distance Education) డిపార్ట్‌మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అడ్మిషన్లపై ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫేజ్ 2 నోటిఫికేషన్ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రచురించింది. ఇందులో భాగంగా... డిగ్రీ, పీజీ కోర్సులతో (PG Course) పాటు ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు ప్రక్రియకు మార్చి 31, 2024 చివరి తేదీగా ప్రకటించింది.

ముఖ్య వివరాలు:

విశ్వవిద్యాలయం - ప్రొ. జి. రాంరెడ్డి దూరవిద్యా కేంద్రం, ఉస్మానియా విశ్వవిద్యాలయం

కోర్సు వివరాలు: డిప్లొమా కోర్సులు MA, M.Com, M.Sc, BA, B.Com, BBA, PG.

కోర్సుల వ్యవధి: సంబంధిత కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు. డిప్లొమా కోర్సుల కాలవ్యవధి ఒక సంవత్సరం.

మీడియం: కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి.

అర్హత: మీరు క్రింది ఇంటర్మీడియట్ (10+2) / తత్సమానం, గ్రాడ్యుయేషన్ (Graduation), BCom, TS ISET/APISET కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2024

మెయిల్ - info_cde@osmania.ac.in

అధికారిక వెబ్‌సైట్: https://oupgrrcde.com/

ఇలా అప్లై చేయొచ్చు..

http://www.oucde.net/ వెబ్‌సైట్‌కి వెళ్లండి. 'ఆన్‌లైన్ అడ్మిషన్' ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ యూజీ, పీజీ, డిప్లొమా, ఎంబీఎం, ఎంసీఏ ఎంపికలు ఉంటాయి. మీరు చేరాలనుకుంటున్న కోర్సుపై క్లిక్ చేయాలి.

-ఇక్కడ మీరు నమోదు చేసుకోవాలి. ఈ ఇమెయిల్ ID ,మొబైల్ నంబర్ తప్పనిసరి. ఆ తర్వాత కోర్సు ఎంపిక, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. కోర్సు ఫీజులను సెమిస్టర్‌కు సెట్ చేయవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story