జాబ్స్ & ఎడ్యూకేషన్

Post Office Recruitment 2022 : పది అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.19,900 - రూ.63,200

Post Office Recruitment 2022 : నోటిఫికేషన్‌లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్ధులకు ఉండాలి.

Post Office Recruitment 2022 : పది అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.19,900 - రూ.63,200
X

India Post Recruitment 2022: ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకిగాను నోటిఫికేషన్ విడుదల అయింది. కేంద్ర సమాచార, ఐటీ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ న్యూఢిల్లీలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 29. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టులో పంపాల్సి ఉంటుంది. పదవతరగతి పాస్ కావడంతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన డ్రైవింగ్ అర్హతలు కూడా అభ్యర్ధులకు ఉండాలి. పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం..

మొత్తం ఖాళీలు: 29

అన్ రిజర్వ్‌డ్ : 15

ఎస్సీ: 3

ఓబీసీ: 8

ఈడబ్ల్యూఎస్ : 3

గుర్తుంచుకోవాల్సిన అంశాలు..

దరఖాస్తు ప్రారంభం: జనవరి 21, 2022

దరఖాస్తుకు చివరి తేదీ: 2022 మార్చి 15

విద్యార్హతలు: 10వ తరగతి పాస్ కావడంతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయస్సు: 27 ఏళ్ల లోపు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: టెస్ట్, స్కిల్ టెస్ట్

వేతనం: అభ్యర్థులకు ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager, Mail Motor Service, C-121, Naraina Industrial Area Phase-I, Naraina, New Delhi- 110028.

అప్లై చేసే విధానం..

అభ్యర్ధులు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Recruitment సెక్షన్‌లో Staff Car Driver (Ordinary Grade) నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి.

దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్‌లో ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని పూర్తి చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివది తేదీలోగా చేరేలా స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. కొరియర్ ద్వారా పంపే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు.

Next Story

RELATED STORIES