South Central Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ

South Central Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ
South Central Recruitment 2022: బాక్సింగ్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో రాణించిన వారై ఉండాలి. అప్లై చేయడానికి 2022 జనవరి 17 చివరి తేదీ. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

South Central Railway Jobs 2022: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. ఖాళీల వివరాలు,

విద్యార్హతలు, దరఖాస్తు విధానం..

మొత్తం ఖాళీలు.. 21

బాక్సింగ్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో రాణించిన వారై ఉండాలి. అప్లై చేయడానికి 2022 జనవరి 17 చివరి తేదీ. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

అథ్లెటిక్స్ (మెన్): 2,

అథ్లెటిక్స్ (ఉమెన్): 2,

బాల్ బ్యాడ్మింటర్ (మెన్): 2,

బాస్కెట్ బాల్ (మెన్): 2,

బాస్కెట్ బాల్ (ఉమెన్): 1

బాక్సింగ్ (మెన్): 1

క్రికెట్ (మెన్): 1

హ్యాండ్‌బాల్ (మెన్): 1

హాకీ (మెన్): 1

కబడ్డీ (మెన్): 1

ఖోఖో (మెన్): 1,

వాలీబాల్ (మెన్): 2

వాలీబాల్ (వుమెన్): 1

వెయిట్‌లిప్టింగ్ (మెన్): 1

విద్యార్హతల వివరాలు చూస్తే టెక్నికల్ పోస్టులకు ఎస్‌ఎస్సీ పాస్ కావాలి. లేదా సంబంధిత గ్రేడ్‌లో పాస్ కావాలి.. ఇతర పోస్టులకు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్ క్లాస్ అభ్యర్ధులకు ఫీజు రూ.250. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.

క్రీడార్హతల వివరాలు.. ఒలింపిక్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్ డేవిస్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, థామర్, ఉబెర్ కప్, కామన్ వెల్త్ ఛాంపియన్‌షిప్స్, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్, ఏషియా కప్, సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్‌లో రాణించినవారై ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్ధులు ముందుగా https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో online application for recruitment under sports quota for the year 2021-22 లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో new user registration పైన క్లిక్ చేయాలి.

పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి. అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. లేటెస్ట్ ఫోటో, సంతకం, విద్యార్హతలు, సర్టిఫికెట్స్, క్రీడార్హతల సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.


Tags

Read MoreRead Less
Next Story