భారత్‌లో కరోనా విలయతాండవం.. కొత్తగా 77,266 కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.

X
Admin28 Aug 2020 5:19 AM GMT
corona update in india
corona, india, mumbai,
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 77,266 మంది కరోనా బారినపడగా, 1057 మంది బాధితులు మరణించారు. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,87,501కి చేరింది. ఇప్పటివరకూ 25,83,948 మంది కరోనా నుంచి కోలుకోగా.. 7,42,023 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనాతో 61,529 మంది మృతి చెందారు. బారీగా నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తున్న వైద్యులు రోజు వారీ కేసులు త్వరలోనే లక్షకు చేరుకుంటాయని అన్నారు.
Next Story