Tillu Square : 'టిల్లు స్వ్కేర్' మ్యాటినీ రివ్యూ

Tillu Square : టిల్లు స్వ్కేర్ మ్యాటినీ రివ్యూ

డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ (Tillu Square) థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సమ్మర్ స్పెషల్ పై మ్యాటినీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం.

టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నడుపుతుంటాడు. పాత గొడవలూ, సిల్లీ పంచాయితీలూ మర్చిపోయి హ్యాపీగా బతికేద్దాం అనుకొంటున్న తరుణంలో తన జీవితం లిల్లీ (అనుపమ పరమేశ్వరన్‌) రూపంలో ఊహించని మలుపు తిరుగుతుంది. ఓ పార్టీలో లిల్లీని చూసిన టిల్లూ ఫ్లాటైపోతాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ రాత్రే ఇద్దరూ ఒక్కటైపోతారు. తెల్లారితే.. ఓ చిన్న లెటర్ రాసి, అక్కడ్నుంచి మాయం అయిపోతుంది లిల్లి. అప్పటి నుంచి లిల్లీ ఎక్కడికి వెళ్లిపోయిందో తెలీక పిచ్చోడై తిరుగుతుంటాడు. కొన్ని రోజుల తరవాత లిల్లీ మళ్లీ దర్శనమిస్తుంది. ఆ తరవాత ఏమైంది? అనేది కథ.

సీక్వెల్ లోనూ మ్యాజిక్ రిపీట్ చేశారు మేకర్స్. టిల్లు పాత్రలోనే ఏదో మ్యాజిక్ ఉంది. 'టిల్లు' హిట్టయ్యిందంటే అదేదో అద్భుతమైన కథనో, ఇది వరకు చూడని సినిమా అనో కాదు. టిల్లు క్యారెక్టరైజేషన్‌. ఆ పాత్ర ఎంతలా పట్టేసిందంటే - తను ఏం మాట్లాడినా వినాలని అనిపిస్తుంది. 'టిల్లు స్క్వేర్‌' కథ కోసం సిద్దు జొన్నలగడ్డ పెద్దగా కష్టపడలేదు అనిపిస్తుంది కానీ.. అందులోనే చాలా కష్టం దాగుంది.

ఓ సాధారణమైన కథని, తనకే సాధ్యమైన డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్ తో సిద్దు స్పెషల్ గా మార్చేశాడు. ట్విస్టులతో కథ ఇంట్రస్టింగ్ గా సాగుతుంటుంది. యాక్టింగ్, డైలాగ్ డిక్షన్, టైమింగ్.. అన్నింటా టిల్లు అలా తెరపై ఆవిష్కరించుకుంటూ అలరించుకుంటూ పోయాడంటున్నారు ఫ్యాన్స్. అక్కడ సిద్దూ ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు చేసుకొంటూ సుదీర్ఘమైన డైలాగులు చెప్పడం ఇవన్నీ హిలేరియస్‌గా నడిచిపోయాయి. చివరి 10 నిమిషాలూ మరోరకంగా సాగింది. అక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. ఇది కూడా హాగా అలరిస్తుంది. ఇలాంటి సీక్వెన్స్ లు మరెన్నో వస్తాయనడంలో సందేహం లేదు.

మ్యాటినీ ఆడియన్స్ రివ్యూ 3.5.

Tags

Read MoreRead Less
Next Story