Air India : ఎయిర్ ఇండియాపై రూ.80 లక్షల ఫైన్

Air India : ఎయిర్ ఇండియాపై రూ.80 లక్షల ఫైన్

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై రూ.80 లక్షల జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), విమాన సిబ్బంది అలసట నిర్వహణ వ్యవస్థ (FMS) నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జనవరిలో ఎయిర్ ఇండియాపై స్పాట్ ఆడిట్ నిర్వహించి, సాక్ష్యాలను సేకరించి, విమానాల వారీగా రాండమ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. "ఎయిరిండియా లిమిటెడ్ 60 ఏళ్లు పైబడిన ఫ్లైట్ సిబ్బందితో కలిసి కొన్ని సందర్భాల్లో కలిసి విమానాలు నడుపుతున్నట్లు నివేదికలు, ఆధారాల విశ్లేషణలో వెల్లడైంది.

ఉల్లంఘనలకు సంబంధించి మార్చి 1న రెగ్యులేటర్ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. "షోకాజ్ నోటీసుకు ఆపరేటర్ తన ప్రతిస్పందనను సమర్పించారు. అది సంతృప్తికరంగా కనిపించలేదు. ఆపరేటర్ సమర్పించిన సంతృప్తికరంగా లేని ప్రతిస్పందన ప్రకారం, ఆపరేటర్‌పై రూ. 80,00,000 జరిమానా విధించారు" అని ప్రకటన తెలిపింది.

విమానయాన సంస్థలకు జరిమానా విధించడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు మార్చిలో, ఎయిర్‌క్రాఫ్ట్ నుండి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు నడుచుకుంటూ కుప్పకూలిపోయి మరణించిన 80ఏళ్ల ప్రయాణికుడికి వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో ఎయిర్ ఇండియాకు సివిల్ ఏవియేటర్ రూ. 30 లక్షల జరిమానా విధించారు.

అంతకుముందు ఫిబ్రవరి 20న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విమాన ప్రయాణికుడి మృతిపై DGCAకి నోటీసు పంపింది. మీడియా కథనాల ప్రకారం, అమెరికాకు చెందిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో సుమారు 1.5 కి.మీ నడిచిన తర్వాత కుప్పకూలిపోయాడు. అతను వీల్ చైర్‌లో ఉన్న తన భార్యతో కలిసి నడిచాడు.

Tags

Read MoreRead Less
Next Story