ఒకప్పుడు రోజుకు రూ. 250.. ఇప్పుడు నెలకు లక్షలు.. యూట్యూబర్ సక్సెస్ స్టోరీ

ఒకప్పుడు రోజుకు రూ. 250.. ఇప్పుడు నెలకు లక్షలు.. యూట్యూబర్ సక్సెస్ స్టోరీ
యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించ వచ్చని తెలుసుకున్న తరువాత, తాను కూడా తనకు వచ్చిన విద్యను ఉపయోగించి డబ్బు సంపాదించాలనుకున్నాడు..

యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించ వచ్చని తెలుసుకున్న తరువాత, తాను కూడా తనకు వచ్చిన విద్యను ఉపయోగించి డబ్బు సంపాదించాలనుకున్నాడు.. అతను అనేక రకాల సాంప్రదాయ ఒడియా వంటకాలతో తన యూట్యూబ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇసాక్ 2020 మార్చిలో పప్పు, పచ్చిమిర్చి, టొమాటోలు, మిరపకాయలు వేసి తయారు చేసిన కూరను అన్నంలో కలిపి తింటూ దానికి ఆస్వాదిస్తున్న వీడియోతో యూట్యూబ్‌లోకి ప్రవేశించాడు.

ఒడిశాకు చెందిన ఇసాక్ ముండా, గతంలో రోజువారీ కూలీ, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. కోవిడ్ మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చి వేసింది. చాలా మంది ఆ సమయాన్ని తమకు అవకాశంగా మార్చుకున్నారు. ఆ సమయంతో ఇసాక్ కూడా తనకు ఉన్న చిన్నపాటి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. నిరుద్యోగిగా మిగిలిపోయాడు. కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని తెలుసుకున్న తరువాత తాను ఆ రంగంలోకి ప్రవేశించాలనుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేసేవాడు.. అంతగా ఆదరణ లభించలేదు.. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు.

"ప్రారంభంలో, నా వీడియోలను ఎవరూ చూడలేదు, కానీ నెమ్మదిగా, ప్రజలు నా ప్రొఫైల్‌ను సందర్శించడం ప్రారంభించారు" అని అతను మీడియాతో పంచుకున్నాడు.

కొద్ది రోజుల తరువాత, ఒడిషాలో బాగా ఇష్టపడే పులియబెట్టిన అన్నం రుచికరమైన బాసి పఖాలాను ఆస్వాదించిన అతని వీడియో ఒకటి వైరల్ అయింది. అది అతనిని 20,000 మంది సభ్యులకు చేర్చింది. "యుఎస్, బ్రెజిల్, మంగోలియా మొదలైన వారు కూడా నా వీడియోలను చూస్తున్నారని తెలిసి ఇదంతా కలా నిజమా అని అనుకున్నానని చెబుతాడు. ఇప్పుడు ఇసాక్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. మన్ కీ బాత్ రేడియో షోలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇసాక్ ని ప్రశంసించారు.

“ఈ రోజు, నా వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు నేను నెలకు దాదాపు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నాను. నా వీడియోలను ఎడిట్ చేయడం కోసం నేను ల్యాప్‌టాప్‌ని కొనుగోలు చేసాను. సెకండ్ హ్యాండ్ కారుని కూడా కొనుగోలు చేసాను. ఈ రోజు, నేను నా కుటుంబానికి మేము కలలో కూడా ఊహించని జీవితాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు ఇసాక్.

Tags

Read MoreRead Less
Next Story