పంజాబ్ లో ఆప్ ఒంటరి పోరు.. ఇండియా కూటమికి మరో దెబ్బ

పంజాబ్ లో ఆప్ ఒంటరి పోరు.. ఇండియా కూటమికి మరో దెబ్బ

2024 లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trunamul Congress Party) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు పంజాబ్ లో (Punjab) కూడా అదేరకమైన పరిస్థితి వచ్చింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధినేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagavanth maan) బుధవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లోనూ మాత్రమే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ కు ఒక్కరోజులో రెండు షాక్ లు తగిలాయి. పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలను ఆప్‌ గెలుస్తుందని భగవంత్‌మన్‌ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, పంజాబ్‌లో సీట్ల పంపకాలపై ఆప్, కాంగ్రెస్ చర్చలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. మాన్ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆప్ ,తృణమూల్ కాంగ్రెస్ రెండూ భారత ప్రతిపక్ష కూటమి అంటే ఇండియాలో భాగమే కావడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story