'కుల గణన' తర్వాత.. 'ఆర్థిక సర్వే'కు రాహుల్ హామీ

కుల గణన తర్వాత.. ఆర్థిక సర్వేకు రాహుల్ హామీ

2024లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే, కుల గణన, వాస్తవికతను అంచనా వేయడానికి ఆర్థిక సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ (Congress) మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రకటించారు. అంతకుముందు కులాల సర్వే ప్రాధాన్యతను కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. దేశంలోని దాదాపు 73% OBCలు, SCలు, STలకు పెద్ద పెద్ద సంస్థలు, మీడియా సంస్థలు లేదా హైకోర్టులలో కూడా ప్రాతినిధ్యం తక్కువ లేదా అసలే లేదని పేర్కొంటూ దీన్ని వారు 'సోషల్ ఎక్స్-రే'గా అభివర్ణించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో విడతలో భాగంగా ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన రాహుల్, అంతకుముందు ప్రధాని తనను తాను ఓబీసీ అని పిలుచుకున్నారని, కానీ ఇప్పుడు ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశంలోని యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story