Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో వికెట్

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో వికెట్

ఢిల్లీ (Delhi) మద్యం పాలసీ కేసులో సంచలనాలు, అరెస్టులకు ఇబ్బట్లో బ్రేక్ పడేటట్టు లేదు. ఆప్‌ మరో మంత్రికి ఈడీ నోటీసు ఇచ్చింది. కేజ్రీవాల్‌ (Kejriwal) కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్‌ గెహ్లాట్‌కు నోటీసులు పంపింది. శనివారం మార్చి 30న నాడే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది.

లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ.. ఈ నెల 21 వ తేదీన కేజ్రీవాల్‌ నివాసంలో సోదాలు నిర్వహించి ఆయనను అరెస్టు చేసింది. మొదట ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచి.. ఈ నెల 28 వరకు కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత మరోసారి కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు ఏప్రిల్ 1 వ తేదీకి ఈడీ కస్టడీని పొడగించింది. కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రి గెహ్లాట్‌ ప్రస్తుతం నజఫ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించిన ప్యానల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌ నాయర్‌ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్‌ తరచూ ఫోన్‌ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది.

ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ముందు సంచలంగా మారింది. బిగ్ షాట్లు అరెస్టైనా కూడా ఆప్ ను మాత్రం కష్టాలు వదలడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story