Bandi Sanjay : మోదీ, రాహుల్ మధ్య జరుగుతున్న ఎన్నికలివి : బండి సంజయ్

Bandi Sanjay : మోదీ, రాహుల్ మధ్య జరుగుతున్న ఎన్నికలివి :  బండి సంజయ్

దేశంలో ప్రస్తుతం జరుగుతు న్న ఎన్నికలు నరేంద్రమోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. పదేళ్ల ఎన్డీఏ పాలనపై, అంతకుముందు 10 ఏళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసుకొని ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లోని ఎంపీ ఆఫీస్ లో బండి సంజయ్ సమక్షంలో బీఆ ర్ఎస్ కార్పొరేటర్లు కొలిపాక అంజయ్య(50వ డివిజన్), వంగల శ్రీదేవి (46వ డివిజన్), మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీను, 47 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షు రాలు అన్నపూర్ణ, ఆరెపల్లి మాజీ సర్పంచ్ కాశెట్టి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాదం రాజు సహా సుమారు 100 మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యక ర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రం లోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ .. సిగ్గులేకుండా తాను సుద్దపూస నని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్నారని విమర్శించారు. '100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నాపై కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నా ఆస్తిపాస్తులు, నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?' అని సంజయ్ సవాల్ విసిరారు. కరీం నగర్ లో గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతోందని, ఎవరి పక్షాన నిలిచి ఓటేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.

కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు అందించిన సహకా రంతోనే అలుపెరగని పోరాటాలు చేసి ఈ స్థాయికి ఎదిగానని బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగా మంగళవారం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీరు తయారు చేసిన బిడ్డను కరీంనగర్ లోని ప్రతి చౌరస్తాలో కొ ట్లాడానని, ప్రజా సమస్యలపై పోరాటం చేసి అరెస్ట్ అయినప్పుడల్లా బెయిల్ ఇప్పిస్తూ అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story