I.N.D.I.A. కూటమి నుంచి మరో పార్టీ జంప్

I.N.D.I.A. కూటమి నుంచి మరో పార్టీ జంప్

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కాంగ్రెస్ (Congress) కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్రలతో జోరుమీదున్న రాహుల్ గాందీకి ఇది మరో షాకింగ్ న్యూస్ లాంటిదే. ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటయ్యింది ఇండియా కూటమి. ఐతే.. ఒక్కొక్కటిగా ప్రధాన పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నాయి.

ఇండియా కూటమితో పొత్తు లేదని గతంలోనే తేల్చిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం నాడు 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో.. కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. తాజాగా కమ్యూనిస్టు పార్టీ సైతం కూటమికి షాక్ ఇచ్చింది. జార్ఖండ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) కూటమి నుండి వైదొలిగి, రాబోయే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు గానూ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ స్పష్టం చేసింది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర పాఠక్ తెలిపారు. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆలస్యం చేస్తోందని.. అందుకే ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు జార్ఖండ్ సీపీఐ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story