Congress : ప్రధాని మోదీపై క్రిమినల్ కేసు పెట్టండి: కాంగ్రెస్

Congress : ప్రధాని మోదీపై క్రిమినల్ కేసు పెట్టండి: కాంగ్రెస్

ప్రధాని మోదీపై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మైసూర్ ప్రచారంలో కాంగ్రెస్‌ను విచ్ఛిన్న ముఠాల సుల్తాన్ అని మోదీ విమర్శించడంపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారికి కేపీసీసీ ఓ లేఖ రాసింది. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బహిష్కరించాయని, హిందూ మతంలోని బలాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇండియా కూటమి కోరుకుంటోందని మోదీ ఆరోపించారని ఈసీకి రాసిన లేఖలో వివరించింది. ప్రధానిపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరింది. ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రధానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.

దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే ఆలోచనను బీజేపీ అమలు చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది ప్రజలను అవమానించడమేనన్నారు. వయనాడ్‌ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘భారతదేశం పూలగుత్తి వంటిది. అందులోని ప్రతి పుష్పాన్నీ గౌరవించాలి. అప్పుడే అందం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలు, భాష, మతం, సంస్కృతిని ప్రేమించాలని కాంగ్రెస్ కోరుకుంటే.. బీజేపీ విరుద్ధంగా పనిచేస్తోందని మండిపడ్డారు.

మరోవైపు బీజేపీ 400కుపైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. తమ పార్టీ అజెండాపై ప్రతిపక్షాలు ప్రజలను భయబ్రాంతులను గురిచేయడం మానుకోవాలని సూచించారు. ‘నేను పెద్ద ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నందుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టాలని నిర్ణయం తీసుకోను. దేశ అభివృద్ధి గురించి ఆలోచించే తీసుకుంటా’ అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story