Congress : కాంగ్రెస్‌కు రిలీఫ్.. బ్యాంక్ ఖాతాలు యాక్టివేట్ చేసిన ఐటీ శాఖ

Congress : కాంగ్రెస్‌కు రిలీఫ్.. బ్యాంక్ ఖాతాలు యాక్టివేట్ చేసిన ఐటీ శాఖ

కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సంబంధించిన పలు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అంశం శుక్రవారం సంచలనం రేపింది. ఆదాయపన్ను శాఖ ఫ్రీజ్ చేసిన వాటిలో.. యూత్ కాంగ్రెస్ అకౌంట్ కూడా ఉంది. ఐతే.. దీనిపై కాంగ్రెస్ పార్టీ తగిన చర్యలు తీసుకుంది. ఐటీని సంప్రదించింది.

ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ అప్పీల్ చేసింది. దీంతో.. గంట సమయంలోనే రిలీఫ్ దక్కింది. వచ్చే వారం తుది విచారణ పూర్తయ్యేవరకు ఈ ఖాతాలను యాక్టివేట్ చేస్తున్నట్టు ఐటీ శాఖ వెల్లడించింది.

ఏం జరిగిందంటే..

లోక్‌సభ ఎన్నికల సమరం ప్రారంభానికి వారం రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ వెల్లడించారు. పార్టీ ఇచ్చిన చెక్కులను గౌరవించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నట్లు ఫిబ్రవరి 15న సమాచారం అందింది. తదుపరి విచారణలో యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు తేలింది. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల నుంచి రూ.210 కోట్లు రికవరీ చేయాలని ఆదాయపు పన్ను కోరింది. మా ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బు స్తంభింపజేయబడింది. ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు ప్రతిపక్షాల ఖాతాలు స్తంభింపజేయడం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడంతో సమానం అని కాంగ్రెస్ ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story