Congress : కాంగ్రెస్‌కు షాక్.. సావిత్రి జిందాల్‌ రాజీనామా

Congress : కాంగ్రెస్‌కు షాక్.. సావిత్రి జిందాల్‌ రాజీనామా

లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు (Congress) మరో షాక్ తగిలింది. ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ (Savitri Jindal) కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. పార్టీని వీడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. జిందాల్‌ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

2005లో జిందాల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు ఓపీ జిందాల్‌ విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం హిసార్‌ నియోజకవర్గం నుంచి సావిత్రి జిందాల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాను పది సంవత్సరాలుగా హిసార్‌ ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రాతినిథ్యం వహించానని.. రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశానన్నారు. కుటుంబ సభ్యుల సూచన మేరకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ నాయకత్వానికి, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 2009లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. 29 అక్టోబర్ 2013న హర్యానా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నియామకమయ్యారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ, గృహనిర్మాణం శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె హర్యానా శాసనసభ సభ్యురాలిగా చేశారు. 2010 వరకు విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగారు. 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి పోటీచేసి గెలవలేకపోయారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మార్చి 28, 2024 నాటికి, సావిత్రి జిందాల్ నికర విలువ 29.6 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.2.47 లక్షల కోట్లు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. జిందాల్ గ్రూప్ భారీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. సావిత్రీ జిందాల్‌ కుమారుడు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ చైర్మన్ నవీన్ జిందాల్ ఇటీవల బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి నవీన్‌ జిందాల్ పోటీ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story