Namitha : హీరో విజయ్‌ పై పోటీ చేస్తా : నమిత

Namitha : హీరో విజయ్‌ పై పోటీ చేస్తా :  నమిత

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(2026) కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతిపై తాను పోటీ చేస్తానని బీజేపీ నేత, హీరోయిన్ నమిత ప్రకటించారు. ‘రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని అనుకుంటున్నా. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. . నటి నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ తరఫున నమిత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నీలగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎల్‌ మురుగన్‌ పోటీ చేయడంతో ఆయన తరపున నటి నమిత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నమితను చూసేందుకు జనం ఎగబడ్డారు. నమితకు తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. నటి నమితపై ప్రజలు పిచ్చి అభిమానం పెట్టుకున్నారు. నటి నమిత కోసం అభిమానులు గుడికూడా కట్టించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి నమిత పోటీ చేసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story