Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఇదే

Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఇదే

తిహార్ జైలులో కేజ్రీవాల్‌కు రెండో నంబర్ గదిని కేటాయించారు. ఆయన డైలీ రొటీన్ ఉ.6:30కు ప్రారంభమవుతుంది. బ్రేక్ ఫాస్ట్‌లో టీ, బ్రెడ్ ఇస్తారు. కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే ఆయన తన లాయర్లతో భేటీ కావొచ్చు. ఉ.10:30-11 మధ్య పప్పు, కర్రీ, 5 రొట్టెలు భోజనంగా ఇస్తారు. మ.3:30కి టీ, బిస్కట్లు ఇస్తారు. సా.4కి లాయర్లను మీట్ అవ్వొచ్చు. సా.5:30కి డిన్నర్ ఉంటుంది. రాత్రి 7కల్లా మళ్లీ సెల్‌కి పంపిస్తారు.

కేజ్రీవాల్‌కు టీవీలో 18-20 ఛానల్స్ చూసేందుకు జైలు అధికారులు అనుమతిచ్చారు. 24 గంటలూ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటారు. ఆయనకు డయాబెటిస్ సమస్య ఉండడంతో రెగ్యులర్ చెకప్‌లు చేయనున్నారు. వారానికి రెండు సార్లు ఫ్యామిలీతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. 3 పుస్తకాలు, టేబుల్, కుర్చీ, మందులు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మార్చి 15న అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story