EC : ఈసీనా మజాకా.. ఇప్పటికే రూ.4,650కోట్లు సీజ్.. ఆల్ టైం హై

EC : ఈసీనా మజాకా.. ఇప్పటికే రూ.4,650కోట్లు సీజ్.. ఆల్ టైం హై

దేశంలో ఎన్నికల టైంలో డబ్బులు పంచడం భారీగా పెరిగిపోయింది. ఈసీ, పోలీసుల తనిఖీల్లో దొరుకుతున్న డబ్బే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. లోక్ సభ ఎన్నికల టైంలో పోలింగ్ కు ముందే ఈసారి భారీగా నగదు ప్రవాహం జరిగింది.

75 ఏళ్ల భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నగదును స్వాధీనం చేసుకున్నామని ఈసీ వెల్లడించింది. తొలి దశ పోలింగ్‌కు ముందు రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్లను స్వాధీనం చేసుకున్నామని ఈసీ తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో రూ.3,475 కోట్లను ఈసీ సీజ్ చేసింది.

ఇప్పటికే పాత మార్క్ ను దాటి వెయ్యి కోట్లు ఎక్కువగా దొరికాయి. 2024లో మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా యావరేజ్ గా రోజుకు రూ.100కోట్లు పట్టుకుంది ఈసీ. డబ్బుల కట్టలు, బంగారు బిస్కెట్లు, వెండి, ఇతర వస్తువులు.. అన్నీ కలిపి భారీగా ప్రలోభాలు జరుగుతున్నాయనేది ఈసీ అధికారులు అంటున్న మాట. ఎన్ని రూల్స్ పెట్టినా.. వెళ్లాల్సిన డబ్బు వెళ్తోంది.. చేరాల్సిన కాడికి చేరుతోంది అంటున్నారు ఈసీ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story