FACT CHECK : ఓటేయకుంటే డబ్బులు కట్ కావు.. నిజం తెలుసుకోండి

FACT CHECK : ఓటేయకుంటే డబ్బులు కట్ కావు.. నిజం తెలుసుకోండి

ఏది పడితే అది సోషల్ మీడియాలో తిరుగుతుంటుంది. అలా అని వాటిని నమ్మొద్దు. కొన్ని రోజులుగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది చూసిన వారు కూడా నిజమే అని నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకపోతే మీ అకౌంట్ నుంచి రూ.350 కట్ అవుతుందని ఆ న్యూస్ లో ఉంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ఆ డబ్బులు కట్ అవుతాయని న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అకౌంట్ లో డబ్బులు మెయింటేన్ చేయకపోతే.. ఫోన్ రీచార్జ్ వేసుకునే సమయంలో అయినా కట్ అవుతాయట. ఈ విషయం తెలుసుకున్న చాలామంది నిజం అనుకున్నారు. ఐతే.. కేంద్ర ఎన్నికల సంఘం దీనిని పరిశీలించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పూర్తిగా అవాస్తవం అని తెలిపింది. ఓటు వేయకుంటే డబ్బులు కట్ అవుతాయనేది పూర్తిగా అబద్దం.. ఎవరూ నమ్మొద్దు అని చెప్పింది.

ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అధికారులు. అన్ని పార్టీలు సోషల్ మీడియాను బలంగా వాడుకోవడానికి రెడీ అయిపోయాయి. సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నాయి. తమ పార్టీకే ఓట్లు వేయాలని కోరుతున్నారు. సో.. ఓట్లకు సంబంధించింది నమ్మే ముందు.. ప్రధాన వార్తా స్రవంతి పత్రికలు,వెబ్ సైట్లు, టీవీ ఛానళ్లలో వచ్చిందా లేదా అనేది ఓసారి క్రాస్ చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు. గూగుల్ లో ఓసారి సర్చ్ చేస్తే నమ్మదగ్గ వార్త వెబ్ సైట్లలో లింక్స్ వస్తాయి. వాటిని చదివి క్రాస్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story