Prices Drop : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ... ఏ రాష్ట్రంలో ఎంతెంతుంది ?

Prices Drop : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ... ఏ రాష్ట్రంలో ఎంతెంతుంది ?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం లీటర్ కు 2 రూపాయల చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. చమురు సంస్థలు వీటి ధరలను సమీక్షించాలని నిర్ణయించంతో ఈ మేరకు పెట్రోలియం శాఖ ప్రకటించింది.

ధరలు తగ్గిన తరువాత ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 94.72 రూపాయలుగా, ముంబైలో 104.21 రూపాయలు, కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర 103.94 రూపాయలుగా, చెన్నైలో 100.75 రూపాయలుగా ఉంటాయి. ఢిల్లీలో డీజీల్ ధర లీటర్ కు 87.62 రూపాయలుగా, ముంబైలో లీటర్ కు 92.15 రూపాయలుగా, కోల్కతాలో 90.76 రూపాయలుగా, చెన్నైలో 92.34 రూపాయలుగా ఉంటుంది.

పెట్రోల్, డీజెల్ ధర తగ్గడం వల్ల దేశంలో నడుస్తున్న 58 లక్షల గూడ్స్ వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల టూ వీలర్స్ యజమానులకు ప్రయోజనం కలుగుతుందని పెట్రోలియం శాఖ పేర్కొంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story