PM Modi : ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు: ప్రధాని మోడీ

PM Modi : ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు: ప్రధాని మోడీ

ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు తమ ఆందోళనలను తాను అర్ధం చేసుకున్నానని ముస్లిం సోదరీ మణులు భావించారని ప్రధాని మోడీ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో వాడీవేడిగా జరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు.

'ముస్లింలను మేం వ్యతిరేకించం. అది మా విధానం కాదు. నెహ్రు కాలం నుంచే వారు ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. దాని నుంచి లబ్ది పొందాలని చూస్తున్నారు. మమ్మల్ని వ్యతిరేకు లుగా చూపించి,, తాము వారికి స్నేహితులమంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తారు. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతగా మారింది. ట్రిపుల్ తలాక్ కనుచేసినప్పుడు వారి ఆందోళనపై నేను నిజాయితీగా ఉన్నానని ముస్లిం సోదరీ మణులు భావించారు. ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అలాగే భావించారు. నేను ఎవరిపైనా వివక్ష చూపడంలేదని నాకు అర్ధం చేసుకున్నారు. వివక్షాలు అబద్దాలు కయటపడ్డాయి. అదే వారిబావ, అందుకే తప్పుదోవ వట్టించేందుకు రకరకాల అబద్దాలు చెప్పునే ఉంటారు.' అని మోడీ విరుచుకుపడ్డారు.

కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీదైన ముస్లింలకు పంచుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనియాంశంగా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story