UPI : మారిషస్, శ్రీలంకలో ఇండియన్ యూపీఐ సేవలు

UPI : మారిషస్, శ్రీలంకలో ఇండియన్ యూపీఐ సేవలు

భారతదేశం తన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను శ్రీలంక, మారిషస్‌లలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ చొరవలో భాగంగా మారిషస్‌లో రూపే కార్డ్ సేవలు ప్రారంభమయ్యాయి. శ్రీలంకలో మొట్టమొదటి సారిగా UPI ద్వారా లావాదేవీలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో (Modi) పాటు మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాత్, శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే కూడా హాజరయ్యారు.

యూపీఐ సిస్టమ్‌తో శ్రీలంక, మారిషస్‌లు ప్రయోజనం పొందుతాయని నమ్ముతున్నానని రెండు దేశాల్లో యుపిఐ సేవలను ప్రారంభించిన సందర్భంగా పీఎం మోదీ అన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన UPI సేవలు, మొబైల్ ఫోన్‌ల ద్వారా తక్షణ రియల్ టైమ్ బ్యాంక్ లావాదేవీలను అనుమతిస్తుంది. రూపే అనేది భారతీయ ఆధారిత కార్డ్ చెల్లింపు నెట్‌వర్క్. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ విక్రయ కేంద్రాలు, ATMలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ఆమోదించబడుతుంది.

UPI సేవల ప్రారంభం శ్రీలంక, మారిషస్‌లతో భారతదేశ సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. శ్రీలంక, మారిషస్‌లను సందర్శించే భారతీయులకు అలాగే భారతదేశానికి ప్రయాణించే మారిషస్ జాతీయులకు లావాదేవీలను సులభతరం చేయనుంది. శ్రీలంక, మారిషస్‌లలో భారతదేశం UPI సేవలను ప్రారంభించడం మన దేశాల మధ్య బలమైన సంబంధాలను నొక్కి చెబుతుందని ప్రధాని మోదీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story