Rahul : జై సీతారామ్.. రాహుల్ నోట కొత్త నినాదం

Rahul : జై సీతారామ్.. రాహుల్ నోట కొత్త నినాదం

సీతారాముల కల్యాణం మహోత్సవానికి సాక్ష్యంగా నిలుస్తూ దేశవ్యాప్తంగా జనం పులకించిపోతున్నారు. జై శ్రీరామ్ నినాదంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ సందర్భంలో.. కాంగ్రెస్ కొత్త స్లోగన్ ను ట్రెండింగ్ చేస్తోంది.

రామనవమి వేళ కాంగ్రెస్ కొత్త స్లోగన్ ప్రచారం చేస్తోంది. 'జై శ్రీరామ్' నినాదాన్ని బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తుండగా.. కాంగ్రెస్ 'జై సీతారామ్' నినాదాన్ని తెరపైకి తెచ్చింది. జై సీతారామ్ అంటే ఏంటి అని రాహుల్ గాంధీ వివరించే వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

సీతారాముడు ఒకటేనని.. అందుకే జై సీత, జై రామ్ అంటూ రాహుల్ గాంధీ ఆ వీడియోలో అన్నారు. రాముడు జీవితం మొత్తం సీతమ్మ కోసం పోరాడాడని.. అందుకే జై సీతారామ్ అన్నప్పుడు మనం సీతమ్మను కూడా తలుచుకుంటామని చెప్పారు. బీజేపీ నేతలు సీతమ్మను గుర్తించరనీ.. మహిళలను దేవతలుగా గుర్తించడానికి ఇష్టపడరని రాహుల్ విమర్శించారు. ఈ సందర్భంగా 'జై సీతారామ్' అంటూ కాంగ్రెస్ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story