Kejriwal : జైల్లో కేజ్రీవాల్ మ్యాంగో, స్వీట్లు తింటున్నారా..?

Kejriwal : జైల్లో కేజ్రీవాల్ మ్యాంగో, స్వీట్లు తింటున్నారా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. షుగర్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుకునేందుకు ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెర కలిపిన టీ తాగుతున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. తన షుగర్ లెవల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలని, తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించింది.

కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, ఆయన రెగ్యులర్ గా డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉందని కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో కేజ్రీవాల్ లాయర్ తెలిపారు. వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులను సంప్రదించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు.

మరోవైపు.. ఈడీ వాదనలను కోర్టుకు వినిపించారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోహబ్ హుస్సేన్. డయాబెటిస్ ఎక్కువగా ఉందని చెబుతున్న వ్యక్తి.. రోజూ మామిడి పండ్లు తినడం, స్వీట్లు తినడం, చక్కెరతో టీ తాగుతున్నారని ఈ పిటిషన్ ను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. బెయిల్ పొందడానికే ఆయన ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story