Delhi : ఢిల్లీ లిక్కర్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు లింకు.. రాజ్‌దీప్ ట్వీట్

Delhi : ఢిల్లీ లిక్కర్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు లింకు..  రాజ్‌దీప్ ట్వీట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు (Delhi Liquor Scam), ఎలక్టోరల్ బాండ్లకు ఆసక్తికర సంబంధం ఉందని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. ‘ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి నవంబర్ 11, 2022న అరెస్టయ్యారు. 4 రోజుల తర్వాత అరబిందో ఫార్మా నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.5 కోట్లు బీజేపీకి వెళ్లాయి. గత ఏడాది మేలో శరత్ బెయిల్ పిటిషన్‌కు ఈడీ అభ్యంతరం చెప్పలేదు. జూన్ 2న ఆయన రిలీజయ్యారు. నవంబర్ లో రూ. 25 కోట్లు బీజేపీకి చేరాయి’ అని పేర్కొన్నారు.

ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన శరత్.. మద్యం పాలసీ స్కామ్ కేసులో జూన్ 2, 2023న అప్రూవర్ గా మారాడు. అరబిందో ఫార్మా నవంబర్ 8, 2023న బాండ్ల ద్వారా మరో రూ.25 కోట్లను బీజేపీకివిరాళంగా ఇచ్చింది. మొత్తం మీద కంపెనీ రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, అందులో రూ.34.5 కోట్లు బీజేపీకి అందాయి. శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసే ముందు అరబిందో ఫార్మా కూడా బీఆర్ఎస్ కు రూ.15 కోట్లు, టీడీపీకి రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ల్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఇదే కేసులో అరెస్టై.. ఫిబ్రవరి 2023 నుంచి జైలులో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story