PM Modi : బీజేపీకి మోదీ రూ.2 వేల విరాళం

PM Modi : బీజేపీకి మోదీ రూ.2 వేల విరాళం

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ (BJP) ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ పేరిట పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ రూ.2వేల రూపాయలు పార్టీ నిధికి జమచేశారు. ప్రతీ ఒక్కరూ నమో యాప్ ద్వారా బీజేపీకి విరాళాలు ఇవ్వాలని, ప్రజలు పెద్దఎత్తున ఈ కార్యక్రమం లో భాగస్వాములు కావాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పిలుపునిచ్చా రు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) భారతను తీర్చిది ద్దడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, అందులో తాను భాగస్వమ్యం పంచుకోవ డం ఆనందంగా ఉందని అన్నారు.

మార్చి 1 నుంచి చేపట్టిన ఈ విరాళాల (పార్టీ నిధుల సేకరణ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చి లాంఛనంగా ప్రారంభించారు. కాగా పార్టీ నిధుల సేకరణలో బీజేపీ ఎవరికీ అందనంత ఎత్తున ఉంది. ఎన్నికల సంఘం పేర్కొన్న సమాచారం ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఏకంగా రూ.719 కోట్ల రూపాయలు సమీకరించింది. 2021-22తో పోలిస్తే పార్టీ నిధుల సమీకర ణలో 17 శాతం పెరుగుదల నమోదైంది.

ఆ ఏడాది రూ.614 కోట్లు సమీకరిం చింది. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం విధించిన నేపథ్యంలో బీజేపీ పార్టీ నిధుల సమీకరణపై దృష్టిసారించింది. బీజేపీ నిధుల్లో సింహభాగం ఎలక్ట్రో రల్ బాండ్లే కాగా ఇప్పుడు విరాళాల సేకరణపై దృష్టిపెట్టింది. మరోవైపు పార్టీ ఫండ్ సేకరణలో కాంగ్రెస్ వెనుకబడింది. 2021 -22లో ఆ పార్టీ 95.4 కోట్లు సమీ కరించగా 2022-23లో కేవలం రూ.79 కోట్లకే పరిమితమైంది.

Tags

Read MoreRead Less
Next Story