PM Modi : మాస్కోలో ఉగ్రదాడి. స్పందించిన ప్రధాని

PM Modi : మాస్కోలో ఉగ్రదాడి. స్పందించిన ప్రధాని

Russia : రష్యాలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ స్పందించింది. మాస్కోలో ఉగ్రవాదులు సాగించిన ఊచకోతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లో ఐసిస్‌ ఉగ్రసంస్థ పాల్పడిన ఘాతుకాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఉగ్రదాడిపై సోషల్ మాధ్యమాల్లో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ... కాల్పులను తీవ్రంగా తప్పుపట్టారు.

'రష్యా రాజధాని మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు భారత దేశం తరఫున నా ప్రగాఢ సానుభూతి. మా ఆలోచనలు, ప్రార్ధనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయి. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్‌ సంఘీభావంగా నిలుస్తుంది' అని ఎక్స్ లో మోడీ స్పందించారు.

సైనిక దుస్తుల్లో కన్సర్ట్ హాల్‌లోకి చొచ్చుకొని వచ్చిన దుండగులు.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పులతో పాటు బాంబులు విసిరి బిభత్సం సృష్టించారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా.. 150 మందికి పైగా గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story